రేపే మెగాస్టార్ బర్త్‌డే కార్నివాల్ ఈవెంట్
ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రేపు మెగా కార్నివాల్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ హాల్-2లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అభిమానుల సమక్షంలో సెలబ్రేషన్స్ ఘనంగా జరగనున్నాయి. ఈవెంట్లో డీజే, డ్యాన్సులు, పాటలు, స్కిట్స్ అన్నింటితో ఫుల్‌గా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. శ్రేయాస్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మినహాయించి మెగా హీరోలు, కుటుంబసభ్యులు అందరూ ఇందులో పాల్గొంటున్నారు.