చార్మినార్‌కు బాంబు బెదిరింపు కలకలం
హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్ దత్త బాంబు కలకలం రేగింది. చార్మినార్ వద్ద బాంబు పెట్టినట్లు ఆగంతకుల నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేశారు. ముందుగా ఫుట్‌పాత్ వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అనంతరం చుట్టుపక్కల దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభించకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇది ఆకతాయిల పని అని పోలీసులు భావిస్తున్నారు.