• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కెప్టెన్ మిల్లర్’ షూటింగ్ స్టార్ట్

    తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ధనుష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేధా థామస్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు కలసి నిర్మిస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

    ‘కెప్టెన్ మిల్లర్’లో నివేదిత సతీష్

    కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మరో హీరోయిన్ నివేదిత సతీష్‌ కూడా ఈ సినిమాలో భాగమైంది. నివేదిత సతీష్‌ ఈ మూవీలో నటిస్తున్నట్లు మూవీ యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’లో ప్రియాంక మోహన్

    గ్లోబల్ స్టార్ ధనుష్, అరుణ్ మాతేశ్వరణ్ కాంబినేషన్‌లో ‘కెప్టెన్ మిల్లర్’ అనే ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఎంపికైంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. అటు తెలుగు నటుడు సందీప్ కిషన్ సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.

    ‘కెప్టెన్ మిల్లర్‌’లో సందీప్ కిషన్

    తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. ఈ మేరకు చిత్ర బృందం ట్విటర్‌లో సందీప్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో సందీప్ కిషన్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.