క్యాసినో కేసు; మంత్రి తలసాని పీఏను విచారించిన ఈడీ
క్యాసినో కేసు వ్యవహారంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్‌ను ఈడీ విచారించింది. ఆయనతో పాటు వ్యాపారవేత్త బుచ్చిరెడ్డిని కూడా విచారించింది. 7 గంటలపాటు వారిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా బుచ్చిరెడ్డి తన బ్యాంకు వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోలో తనకూ 5 శాతం వాటా ఉందని ఒప్పుకున్నాడు. కాగా క్యాసినో కేసులో మొత్తం 130 మందితో ఒక జాబితా తయారు చేసినట్లు సమాచారం.