• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విటర్‌లో లాగిన్‌ సమస్యలు

    ట్విటర్‌ సేవల్లో కొందరికి అంతరాయం కలిగింది. ఉదయం 3 గం. నుంచి 7 గం. మధ్య వినియోగదారులు కొందరు లాగిన్‌ కాలేకపోయారు. లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించగా ఎర్రర్‌ చూపించినట్లు ఫిర్యాదులు చేశారు. మరోవైపు ట్విటర్‌ ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ షాక్‌ ఇచ్చారు. వారికి మెయిల్స్‌ పంపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు సగం మంది సిబ్బందిని తొలగించేందుకు మస్క్‌ సిద్ధమయ్యారని సమాచారం. ఇందులో 7500 మంది ఉన్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

    స్పామ్ అకౌంట్లపై చర్చకు రావాలని ఎలాన్ మస్క్ సవాల్

    స్పామ్ బాట్‌ వినియోగదారుల ఖాతాలపై బహిరంగ చర్చకు రావాలని ఎలాన్ మస్క్ ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్‌కు సవాల్ చేశారు. నిజమైన వివరాలను నిర్ధారించగలిగితే ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేయనున్నట్లు చెప్పారు. ట్విట్టర్ తన ఒప్పందాన్ని మోసపూరితంగా ఉల్లంఘించినట్లు ఎలాన్ మస్క్ ఆరోపిస్తున్నారు. ట్విట్టర్ కంపెనీ కొనుగోలుకు ఏప్రిల్‌లో చేసిన ఒప్పందం నుంచి వైదొలగేందుకు ఎలాన్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ డీల్ గురించి గత నెలలో ఎలాన్ పై ట్విట్టర్ దావా వేసింది.