ఆర్టీసీ ఉద్యోగులకు దివాళి బొనాంజా
దీపావళి కానుకగా ఆర్టీసీ ఉద్యోగులకు 3 డీఏలు విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఇందుకోసం రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న 5 డీఏల్లో 3 డీఏలు చెల్లించేందుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఏడాది క్రితం ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.9 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.14 కోట్లకు చేరిందని వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ డిసెంబర్ కల్లా 1,150 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.