‘తండ్రితో సంబంధం తెంచుకుంటే ఆస్తిపై హక్కు ఉండదు’
కూతురు తన తండ్రితో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని నిర్ణయించుకుంటే తండ్రి వద్ద నుంచి ఎటువంటి ఆస్తి పొందే హక్కు ఉండదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఓ ప్రత్యేక కేసులో విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ప్రకటించింది. 20 ఏళ్ల కూతురికి తన నిర్ణయాలు తీసుకునే హక్కు, స్వాతంత్య్రం ఉంటుందని తెలిపిన కోర్టు.. తండ్రితో బంధం తెంచుకుంటే అతని ఆస్తిలో హక్కు ఉండదని స్పష్టం చేసింది.