డీఏవీ పాఠశాలకు అనుమతి పునరుధ్దరణ
హైదరాబాద్‌లోని డీఏవీ పాఠశాలకు విద్యాశాఖ అనుమతి పునరుద్ధరణ చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ణప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. కాగా బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. దీంతో పాఠశాలను వెంటనే మూసివేశారు. కానీ విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతుండటంతో మళ్లీ తెరిచారు.