TRS పాలనపై నిర్మల ఫైర్
TRS ప్రభుత్వ పాలనపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి టీఆర్ఎస్ చేసిందేంటి? కాళేశ్వరం ద్వారా చుక్క రాలేదు. నియామకాల ఊసే లేదు. తాంత్రికులు చెప్పడం వల్లే సచివాలయానికి రావట్లేదు. తొలుత మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. టీఆర్ఎస్ పాలనలో రూ.3లక్షల కోట్లకు పైగా అప్పు పేరుకుపోయింది. తెలంగాణను, తెలుగును పట్టించుకోని టీఆర్ఎస్ దేశంలో ఏం చేస్తుంది’ అని నిర్మల ప్రశ్నించారు.