ఎన్నికల గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్
TS: ఎన్నికల గుర్తుల విషయంలో టీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించనుంది. మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8గుర్తులను తొలగించాలని న్యాయస్థానంలో రేపు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఎవరికి కేటాయించవద్దని పిటిషన్లో వివరించింది. ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని ఈసీకి లేఖ టీఆర్ఎస్ లేఖ రాసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.