ఎన్టీఆర్ వర్సిటీ బిల్లుకు గవర్నర్ ఆమోదం
AP: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ వర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాసన సభ, మండలిలో బిల్లుకు ఆమోదం తెలిపి సెప్టెంబరు 21న గవర్నర్కు పంపించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. కాగా, పేరు మార్పు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది.