• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 25న యాదాద్రి ఆలయం మూసివేత

    TS: పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ నెల 25న ఉదయం 8.50 గంటలకు మూసివేయనున్నారు. 26వ తేదీ ఉదయం 8గంటలకు సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. 25వ తేదీ సాయంత్రం 4.59గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28గంటలకు ముగియనుంది. దీంతో పాంచనారసింహుడు కొలువైన ప్రధానాలయం, అనుబంధ దేవాలయాలను ఆరోజున ఉదయం 8.50గంటలకు శయనోత్సవ పర్వాలు నిర్వహించి ద్వారబంధనం చేయనున్నారు.

    సామాన్య భక్తుడికి అగచాట్లు..!

    AP: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో విధిస్తున్న ఛార్జీలు భక్తులను భయపెడుతున్నాయి. దేవాదాయశాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో దర్శన, సేవల రుసుములు అధికంగా ఉండటంతో సామాన్య భక్తులు జంకుతున్నారు. శ్రీశైలంలో ఉదయాస్తమాన సేవ కోసం రూ.లక్ష చెల్లించాల్సి వస్తోంది. అంతకు ముందు ఇది రూ.5వేలుగా ఉండేది. విజయవాడ దుర్గమ్మ అంతరాలయ దర్శన టికెట్ రేటు కూడా రూ.300 నుంచి రూ.500కు చేరుకుంది. దీంతో భక్తులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది.

    వినాయక అభిషేకానికి రూ.5వేలు!

    AP: చిత్తూరు కాణిపాకం వినాయకుడి పంచామృత అభిషేక టికెట్ ధర పెంపు వివాదాస్పదమైంది. రూ.700గా ఉన్న ధరను రూ.5000గా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని దేవాదాయశాఖ తప్పుపట్టింది. ఈ మేరకు అదే ధరను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ.. ధర పెంపుపై ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సామాన్యులకు అందుబాటు ధరల్నే అమలు చేస్తామన్నారు.