పోకిరి కలెక్షన్స్ మొత్తం డొనేట్ చేసిన సూపర్‌స్టార్ ఫ్యాన్స్
ఆగస్ట్ 9న మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ‘పోకిరి’ స్పెషల్ షోలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌తో థియేటర్లు నిండిపోయి చాలామందికి టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోకిరికి మరోసారి భారీ కలెక్షన్లు వచ్చాయి. అయితే ఆ డబ్బును మొత్తం సూపర్‌స్టార్ ఫ్యాన్స్ మహేశ్‌బాబు ఫౌండేషన్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్‌కు డొనేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అభిమానులు చేస్తున్న ఈ మంచిపనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.