కప్ గెలిచేది ఇండియానే; డివీలియర్స్
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకుంటుందని దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ జోష్యం చెప్పాడు. ఇండియా-న్యూజిలాండ్‌లు ఫైనల్లో తలపడతాయని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నారని, వీరిని ఆపడం కష్టమని పేర్కొన్నాడు. ఇక భారత జట్టు ప్రతిభావంతులతో నిండి ఉందని, జట్టులోని అందరు ఆటగాళ్లు రాణిస్తున్నారని చెప్పాడు. భారత జట్టే ఖచ్చితంగా టైటిల్ నెగ్గుతుందని పేర్కొన్నాడు.