మారుతి సుజుకి నుంచి కొత్త కారు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లో సరికొత్త ‘గ్రాండ్ విటారా’ కారును బుధవారం ఆవిష్కరించింది. 1.5లీటర్ పెట్రోల్ మెటెడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో దీనిని రూపొందించినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ హిషాషి టకుచి తెలిపారు. ఇది ఒక హైబ్రిడ్ వాహనమని సెల్ఫ్ ఛార్జింగ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ మోడల్ కారు ఉత్పత్తిని ఆగష్టులో ప్రారంభించి.. సెప్టెంబర్ నుంచి విక్రయాలు మొదలు పెడతామని ఆయన వెల్లడించారు.