• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గుజరాత్‌తో కమల సునామీ

  ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ పార్టీ సునామీ సృష్టించింది. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏకంగా 156 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. ఇక కొత్తగా ప్రవేశించిన ఆప్ 5 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీ 52.5 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 27.3 శాతం, ఆప్ 12.9 ఓట్లను తమ ఖాతాల్లో వేసుకున్నాయి. కాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  గుజరాత్‌లో మళ్లీ కమల వికాసం

  గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి BJP సత్తా చాటుతోంది. వరుసగా ఎనిమిదో సారి గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో BJP 157 స్థానాల్లో అధిక్యంతో కొనసాగుతోంది.మ్యాజిక్ ఫిగర్‌ 92 కన్నా చాలా ఎక్కువ సీట్లు సాధించింది. కాంగ్రెస్‌ కేవలం 18 సీట్లలో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 7 సీట్లు, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉంది. గతంలో ఎన్నడూ లేనంత మెజార్జీ దిశగా గుజరాత్‌లో బీజేపీ దూసుకెళ్తోంది.

  ప్రధాని నిబంధన ఉల్లంఘించారు: కాంగ్రెస్

  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లో ఓటు వేయటానికి వచ్చిన ప్రధాని మోదీ తీరుపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ఓటు వేేసేందుకు వచ్చి రోడ్ షో నిర్వహించారని ఆరోపించింది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆక్షేపించింది. ఎన్నికల సంఘం మౌనం పాటించడంపై విమర్శలు చేసింది. గుజరాత్‌లో ప్రభుత్వం, అధికారులు ఏకమయ్యారని ఘాటుగా స్పందించింది. వాహనాలకు భాజపా లోగోలను పెట్టడంతో పాటు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారని నేతలు ఆరోపించారు.

  ఆప్ సభలో రాళ్ల దాడి, బాలుడికి గాయం

  గుజరాత్ లో ఓటింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ సభ జరుగుతుండగా కొందరు రాళ్లు విసిరారు. ఇందులో ఓ బాలుడు గాయపడ్డాడని ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తెలిపారు. మరికొంతమంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కటర్ గామ్ నియోజకవర్గంలో ఓడిపోతారనే భయంతో దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇలాంటి దాడులు ఎందుకని ప్రశ్నించారు.

  ‘మా వాళ్ల జోలికొస్తే చంపేస్తా’

  తన వాళ్ల జోలికొస్తే చంపేస్తానంటూ ఓ ఎమ్మెల్యే అభ్యర్థి హెచ్చరించడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. గుజరాత్‌లో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మధు శ్రీవాస్తవకు ఈ దఫా బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా వాగోడియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘నేను ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తా. ఎవరైనా నా వాళ్ల జోలికొచ్చి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే షూట్ చేసి పాడేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. శ్రీవాస్తవ 2002అల్లర్ల కేసులో నిందితుడుగా ఉండటం గమనార్హం.

  కుమారుడిపై పోటీకి దిగిన తండ్రి

  గుజరాత్ ఎన్నికల సమరంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. కుమారుడిపై పోటీగా తండ్రి నామినేషన్ వేశారు. భారతీయ ట్రైబల్ పార్టీ వ్యవస్థాపకులు ఛోటు వాసవ తన కుమారుడు మహేశ్‌పై ఝుగాడియా స్థానం నుంచి పోటీలోకి దిగారు. అయితే, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం గమనార్హం. ‘బీజేపీపై గెలిచే బలమైన ప్రత్యర్థి ఎవరూ లేకపోవడంతో బరిలోకి దిగాల్సి వచ్చింది’ అని ఛోటు వాసవ వెల్లడించారు. దీనిపై కుమారుడు మహేశ్‌ని అడగ్గా.. ‘నామినేషన్ వేసే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది’ అని వివరణ ఇచ్చారు. మరి వీరిలో … Read more

  గుజరాత్ నేతలకు ‘పెళ్లిళ్ల’ ఫోబియా

  గుజరాత్ ఎలక్షన్స్ జరిగే సమయంలోనే అక్కడ లక్షల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు పెళ్లిళ్ల సీజన్ కొనసాగనుంది. ఇదే సమయంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్‌లో ఎమ్మెల్యే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. పెళ్లిళ్ల హడావుడిలో పడి ప్రజలు ఓటింగ్‌కు దూరమవుతారనే భయం నాయకుల్లో మొదలైంది. ఓటర్లను ఎలాగైనా ఒప్పించి ఓటింగ్‌లో పాల్గొనేటట్లు చేయాలని అక్కడి నాయకులు భావిస్తున్నారు.

  మ‌ళ్లీ కాంగ్రెస్ చెంత‌కు ప్రశాంత్ కిషోర్?

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ మళ్లీ కాంగ్రెస్‌తో క‌ల‌వ‌బోతున్నాడా..? ప్రస్తుత‌ ప‌రిస్థితులు చూస్తూంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఈ సంవ‌త్స‌రం చివ‌ర్లో జ‌ర‌గ‌బోయే గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్య‌త‌ను ఆయ‌నకు అప్ప‌గించనున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే వ‌చ్చే సంవ‌త్స‌రంలో జ‌ర‌గ‌బోయే మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఛత్తీస్ గఢ్, రాజ‌స్థాన్, క‌ర్ణాట‌క‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల కాంట్రాక్టును ఆయ‌న‌కే ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం గుజ‌రాత్ కాంగ్రెస్ నేత‌ల‌ స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడ‌ట‌. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో … Read more