ఆమె చెప్పింది.. ఈయన తీసుకొచ్చాడు
మహిళ హనీ ట్రాప్ బారిన పడి ఓ వ్యక్తి డ్రగ్స్ స్మగ్లింగ్‌కి పాల్పడ్డాడు. రూ.28 కోట్ల విలువైన కొకైన్‌ని దేశంలోకి తీసుకొస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడు పట్టుబడ్డాడు. ఇథియోపియా నుంచి వస్తున్న ప్రయాణికుడు విమానాశ్రయంలో 2.8కిలోల కొకైన్‌తో పోలీసులకు చిక్కాడు. విచారణ చేస్తే ఓ మహిళ వల్లే ఆ వ్యక్తి ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తేలింది. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని సన్నిహితురాలైంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఇలా చేయించిందని విచారణలో బయటపడింది. కాగా, ఇథియోపియా నుంచి డ్రగ్స్ తీసుకురావడం ఇది మూడో సారి.