తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడో రేపో బదిలీల జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.