• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీకి వర్ష సూచన

    శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొమెరిన్ తీరం దిశగా వచ్చినట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో చెదురుముదురు వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. సోమ, మంగళ, బుధవారాల వరకు ఏపీలో వర్షాలు పడతాయని పేర్కొంది. కాగా వాయుగుండం ఎఫెక్ట్‌తో ఆదివారం రాత్రి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో పంట నష్టం వాటిల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

    రేపు ఏపీని తాకనున్న‘మాండూస్’

    మాండూస్ తుఫాన్ గురువారం ఉదయానికి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. అదే దిశలో పయనిస్తూ రెండు రోజుల పాటు అదే ప్రాంతంలో కొనసాగనుందని పేర్కొంది. తీరం దాటిన తర్వాత చిత్తూరు వైపు కదులుతూ క్రమంగా బలహీనపడనుందని వెల్లడించింది. దీని ప్రభావం 8, 9 , 10వ తేదీల్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలపై ఉండనుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

    తుఫాన్‌ ముప్పు ముంగిట దక్షిణ కోస్తాంధ్ర

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 7, 8, 9, 10 తేదీల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని సూచించింది. వాయువ్య బంగాళాఖాతం దిశగా అల్పపీడనం దూసుకొస్తోందని, క్రమంగా తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రత్యేకించి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు … Read more

    తుఫాన్‌గా మారనున్న వాయుగుండం

    బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం తుఫాన్‌గా మారనుంది. ఇది తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. మంగళవారం సాయంత్రానికి అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుఫాన్‌గా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 8న పుదుచ్ఛేరి సమీపంలో తీరానికి చేరుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో ఎక్కువగా ఉంటుందని వివరించింది.

    ఐఎండీ జారీ చేసే ‘అలర్ట్స్‌’కు అర్ధమేంటి?

    భారత వాతావరణ శాఖ శీతాకాలంలోనూ ప్రజలకు, అధికారులకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. నాలుగు రకాల అలర్ట్స్ ప్రకటిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం. వాతావరణంలో ఉష్టోగ్రత 15 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే గ్రీన్ అలెర్ట్ ప్రకటిస్తారు. అంతా బాగుంటేనే గ్రీన్ అలెర్ట్ ప్రకటిస్తారు. ఇక 10 నుంచి 15 డిగ్రీల మధ్యలో ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. దీని ప్రకారం వాతావారణం అధ్వానంగా మారుతుందని అర్ధం. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. అదే 4 నుంచి 10 డిగ్రీల మధ్య … Read more

    నేడు, రేపు ఏపీలో వర్షాలు

    బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా శని, ఆదివారాల్లో ఏపీలో వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లు ప్రకటించింది. కోస్తా తీరం వెంట గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. కాగా అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం ఏకంగా 10 అడుగుల ముందుకు వచ్చింది.

    ఈ నెల 11 నుంచి ఏపీలో వర్షాలు

    నవంబర్ 11 నుంచి ఏపీ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈనెల 9న శ్రీలంక తీరంలో నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది 48 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని, కానీ ఉత్తరాంధ్రలో వర్షాలు పడవని పేర్కొంది. ఏపీ, యానాం మీదుగా ఈశాన్య, తూర్పు గాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో కూడా వర్షాలు పడవని వివరించింది.

    ఏపీలోకి ఈశాన్య రుతుపవనాలు

    ఆంధ్రప్రదేశ్‌లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి రుతు పవనాలు ప్రవేశించాయని.. ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. మరోవైపు నవంబరు రెండో వారం నుంచి తెలంగాణలో చలి అధికంగా ఉంటుందని తెలిపింది.

    కోస్తా జిల్లాలకు తుఫాన్ హెచ్చరిక

    బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో భారత వాతావరణ శాఖ కోస్తా జిల్లాలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 22 నాటికి తుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ కోరింది. తుఫాన్ ముప్పు ఉండటంతో ఒడిషా ప్రభుత్వం ఈ నెల 25 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది.

    5 రోజులపాటు రాయలసీమలో భారీ వర్షాలు

    వచ్చే 5 రోజుల పాటు తమిళనాడు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు రాగల 48 గంటల్లో కర్నాటకలోనూ భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా 11,13,15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా మరో 4 లేదా 5 రోజుల్లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.