ఇంగ్లండ్ ఆల్ అవుట్.. ఇండియా టార్గెట్ 260
ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో ఇంగ్లీష్ బ్యాటర్లు 259 పరుగులకు ఆలౌట్ అయ్యారు. 45.5 ఓవర్లలో 259 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బట్లర్(60), జేసన్ రాయ్(41) రాణించారు. ఇండియన్ బౌలర్లలో పాండ్య 4 వికెట్లు తీసుకొని కీలక పాత్ర పోషించగా.. చాహల్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే 260 పరుగులు చేయాల్సి ఉంటుంది.