‘కాలేజీలపై ఆరోపణలోస్తే ఎప్పుడైనా తనిఖీ చేస్తాం’
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలపై ఆరోపణలు వస్తే ఎప్పుడైనా తనిఖీలు చేస్తామని JNTUH వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు ప్రవేశపెడితే అందుకు సంబంధించిన ల్యాబ్లు, సిబ్బందిని పరిశీలించాకే అనుబంధ కాళాశాలలకు గుర్తింపు ఇస్తామని తెలిపింది. నిజనిర్ధారణ కమిటీలు సమర్పించిన డేటాతో పలు కాలేజీల్లో లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నట్లు JNTUH అధికారులు తెలిపారు. కాలేజీలతో బేరసారాలు అవాస్తవని, తనిఖీలు నిరంతరం జరుగుతాయని పేర్కొన్నారు.