• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరీక్షా హాల్లో విద్యార్థి.. చుట్టూ అమ్మాయిలే; ఏమైందంటే?

    పరీక్షా హాల్లో అందరూ అమ్మాయిలే ఉండటంతో ఓ అబ్బాయి షాక్‌కు గురై స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన బిహార్‌లోని నలందా జిల్లాలో ఉన్న ఓ కాలేజీలో చోటుచేసుకుంది. మనీశ్ కుమార్(17) అనే విద్యార్థి ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ 500 మంది విద్యార్థినులు ఉన్నారు. దీంతో మనీశ్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అంతమంది అమ్మాయిల్ని చూసి కంగారు పడడంతోనే స్పృహ తప్పినట్లు విద్యార్థి బంధువులు తెలిపారు.

    ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ విడుదల

    తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు సోమవారం ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. 2023 మార్చి 15 నుండి పరీక్షలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుండి మార్చి రెండో తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు పరీక్షల విధివిధానాలను ఇంటర్మీడియట్ కళాశాలలు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

    ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ విడుదల

    తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు సోమవారం ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. 2023 మార్చి 15 నుండి పరీక్షలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుండి మార్చి రెండో తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు పరీక్షల విధివిధానాలను ఇంటర్మీడియట్ కళాశాలలు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

    వచ్చే ఏడాది నుంచి ఇంటర్ సిలబస్ మార్పు

    వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మారనుంది. ఈమేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలుగు, ఇంగ్లిష్ సిలబస్ మార్చిన బోర్డు.. త్వరలో మిగతా సబ్జెక్టుల్లోనూ కొత్త మార్పులు తీసుకురానుంది. ఏయే అంశాలు మార్చాలో సబ్జెక్టులవారిగా నిపుణుల కమటీని వేయనుంది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి ఇంటర్ పరీక్షలు వందశాతం సిలబస్‌తో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

    ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు

    TS: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ వచ్చేసింది. రేపటి నుంచి ఈనెల 30 వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌ కోర్సుల విద్యార్థులు రూ.500, సైన్స్‌, వొకేషనల్‌ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 2 నుంచి 6 వరకు, రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు, 1000 రుసుముతో 14 నుంచి 17 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 19 నుంచి 22 వరకు … Read more

    పూర్తి సిలబస్‌తో ఇంటర్ ఎగ్జామ్స్

    ఈ విద్యాసంవత్సరంలో పూర్తి సిలబస్‌తో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలు ఇంటర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కాగా అక్టోబర్ 24 నుంచి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తైందని మిట్టల్ తెలిపారు.

    TS: నేటి నుంచే స‌ప్లిమెంట‌రీ ఎగ్జామ్స్‌

    తెలంగాణ‌లో నేటి నుంచే ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్స్ ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సెకండియ‌ర్ మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌స్ట్ 10 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రోవైపు ప‌దో త‌ర‌గ‌తి స‌ప్టిమెంట‌రీ ఎగ్జామ్స్‌ కూడా నేటి నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. మొత్తం 55,662 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌లకు హాజ‌రుకానున్నారు. ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12.45 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 10 నాటికి ప‌రీక్ష‌లు … Read more