అఫ్గాన్‌లో పేలుడు.. 10మంది మృతి
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినా.. దాడులు ఆగట్లేదు. తాజాగా కాబూల్ మిలిటరీ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. కాబూల్ మిలిటరీ ఎయిర్‌పోర్టు ప్రధాన గేటుకు అతి సమీపంలో ఈ పేలుడు సంభవించిందని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. టఖర్ ప్రావిన్సులో బాంబ్ బ్లాస్ట్ జరిగి నాలుగు రోజులైనా గడవక ముందే ఈ పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం.