కెప్టెన్సీకి కేన్ గుడ్‌బై
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. పనిభారం కారణంగానే నిర్ణయం తీసుకున్నాడట. వన్డే, టీ 20లకు మాత్రమే సారథిగా కొనసాగుతాడు. ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా సేవలందించిన కేన్… జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. జట్టుకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అందించడంతో పాటు గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనూ ఫైనల్ చేర్చాడంలోనూ కేన్‌ది కీలక పాత్ర. అతడి నాయకత్వంలో 38 టెస్ట్‌లు ఆడితే 22 మ్యాచుల్లో విజయం సాధించింది.