నెలలోగా రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయండి: కేసీఆర్
సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల రెండోవారంలోపు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తులు పూర్తికావాలని అధికారులకు సూచించారు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా చైతన్యవంతంగా విభిన్నంగా ఇంజనీర్లు ఆలోచన చేయాలని పేర్కొన్నారు. రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని అందుకనుగునంగా ప్రణాళికలు వేసుకోవాలన్నారు. వానలకు, వరదలకు పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు.