మరోమారు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన పీవీ సింధు
ఒలంపిక్ పతక విజేత, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మరో టోర్నీలో కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. మలేషియా ఓపెన్లో ఈ చాంపియన్ పోరాటం ముగిసింది. ఒలంపిక్ సిల్వర్ మెడల్ విజేత అయిన రెండో సీడ్ తాయి ట్జు యింగ్ చేతిలో పరాజయం పాలైంది. 53 నిముషాల పాటు సాగిన మ్యాచులో సింధు ఓటమి చెందింది. సింధు 13-21, 21-15, 21-13 తేడాతో ఓడిపోయింది.