మాణిక్కం ఠాకూర్ రాజీనామా
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీని ఎన్నుకున్న నేపథ్యంలో ఆయన విధిగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గెలుపొందడంతో 57మందితో కూడా వర్కింగ్ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. ఠాకూర్ ఒక్కడే కాకుండా ఏఐసీసీ ఇన్ఛార్జులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఠాకూర్ తమిళనాడులోని విరుధునగర్ ఎంపీగా ఉన్నారు.