వైద్యరంగంలో తెలంగాణ మేటి
అత్యధిక వైద్య సీట్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. గత ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బోధనాస్పత్రులకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసింది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి 6,040కి చేరింది. ఫలితంగా ఆరో స్థానంలో ఉంది. మెుదటి ఐదు స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ ఉన్నాయి. పీజీ స్పెషాలిటీలో తెలంగాణ ఏడో స్థానం దక్కించుకుంది.