నూతన పార్లమెంట్లోనే బడ్జెట్ సమావేశాలు!
2023-24 ఆర్థిక బడ్జెట్ సమావేశాలు నూతన పార్లమెంట్ భవనంలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెలాఖరుకు భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని, అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం. 65 వేల చ.మీ విస్తీర్ణంలో ఉన్న పార్లమెంట్ నూతన భవనంలో విశాలమైన హాళ్లు, మోడరన్ లైబ్రరీ, రాజ్యాంగహాలు, కార్యాలయాలు, కమిటీ గదులు ఉన్నాయి. లోక్సభలో 888 సీట్లు, రాజ్యసభలో 384 సీట్లను ఏర్పాటు చేశారు.