38 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: మిథున్ చక్రవర్తి
బంగాల్ లో 38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారంలో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో త్వరలోనే అధికారం చేపట్టబోతోందని మిథున్ చక్రవర్తి అన్నారు. అయితే కేవలం ప్రతిపక్ష పార్టీలను దారి మళ్లించేందుకే మిథున్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీఎంసీ ఖండించింది.