‘ఆదిపురుష్’పై MP మంత్రి ఆగ్రహం
‘ఆదిపురుష్’ చిత్రంపై రోజురోజుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్ల వస్త్రధారణను భిన్నంగా చూపించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పురాణాల్లో పేర్కొన్నట్టుగా పాత్రల చిత్రీకరణ లేదు. మత పరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. హనుమంతుడు లెదర్ వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. దీనిపై దర్శకుడికి లేఖ రాస్తున్నా’ అని మంత్రి చెప్పారు. ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.