రేపు ఈడీ విచారణకు సోనియాగాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రేపు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను ఈడీ విచారించనుంది. కరోనా కారణంగా గత నెల రోజుల నుంచి ఆమె విచారణ నుంచి మినహాయింపు పొందారు. తాజాగా మరోసారి సోనియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో విచారణకు హజరు కావాలని సోనిమా భావిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. PN title :