‘ప్రాజెక్ట్ K’ రికార్డ్ బిజినెస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏసియన్ అధినేత సునీల్, నిర్మాత దగ్గుబాటి సురేష్ సంయుక్తంగా ఈ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పడుకొణె నటిస్తోంది.