గూఢాచారి నూర్ ఇనాయత్ ఖాన్ కథ విన్నారా?
బ్రిటీష్ ఇండియా తరఫున తొలి మహిళా గూడఛారిగా పనిచేసిన నూర్ ఇనాయత్ ఖాన్ కథ లండన్ వైదికపై ప్రదర్శనలకు సిద్ధమవుతోంది. ఈనెలలో సౌత్వార్క్ లో దీనిని ప్రదర్శిస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇనాయత్ ఖాన్ ను నాజీ ఆక్రమిత ఫ్రాన్స్ లో మహిళా వైర్ లెస్ ఆపరేటర్ గా బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. బ్రిటన్ రచయిత శబ్రానీ బసు “స్పై ప్రిన్సెస్: ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్ పేరుతో ఆమె కథను తొలుత వెలుగులోకి తీసుకువచ్చింది.