అయిదేళ్లలో దేశంలో పెట్రోల్ ఉండదు
దేశంలో ఇంకో ఐదేళ్లలో పెట్రోల్ అవసరం ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్రలోని డా.పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్ నుంచి గడ్కరీ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. CNG, LNG, గ్రీన్ హైడ్రోజన్లాంటి పర్యావరణానికి మేలు చేసే ఇంధనాల వినియోగం పెరిగితే.. దేశంలో వచ్చే అయిదేళ్లలో పెట్రోల్ అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు.