ఎట్టకేలకు సంజయ్ రౌత్‌కు బెయిల్
102 రోజుల నిరీక్షణ అనంతరం శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. గత జూలై 31న సంజయ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే ఉన్నారు. కాగా సంజయ్ రూ.1,039 కోట్ల విలువైన పట్రాచల్ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో సంజయ్‌కు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.