మెట్రో స్టేషన్లోనే కాదు.. ట్రైన్‌లోనూ డ్యాన్స్‌తో రచ్చచేసిన యువతి
యువతకు సోషల్‌మీడియా పిచ్చి ఎంత పట్టుకుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. నిన్న మెట్రోస్టేషనల్లో డ్యాన్స్ చేస్తూ హల్చల్ చేసిన యువతిపై పోలీసులు సీరియస్ అయ్యారు. మెట్రోస్టేషన్లు వంటి పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఆ యువతి ఎక్కడా తగ్గలేదు. ఈసారి ఏకంగా మెట్రో ట్రైన్లోనే డ్యాన్స్ చేసి వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఆ యువతిపై చర్యలు తీసుకుంటేనే మళ్లీ ఎవరు ఇలా చేయకుండా ఉంటారని అంటున్నారు.