భారీ ధరకు పొన్నియన్ సెల్వన్ ఓటీటీ రైట్స్
మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష తదితర భారీ తారాగణం సినిమాలో నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్-1 సెప్టెంబరు 30న విడుదల కానుంది. చోళుల స్వర్ణయుగాన్ని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఓటీటీ రైట్స్ రూ.125 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయగా, డిజిటల్ రైట్స్‌ను సన్‌టీవీ దక్కించుకుందని సమాచారం.