• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేనూ మయోసైటిస్ బాధితురాలినే; నటి కల్పిక

    హీరోయిన్ సమంత లాగా తానూ మయోసైటిస్ బాధితురాలినేనని నటి కల్పిక గణేష్ తెలిపారు. సమంత మూడో దశలో ఉందని, తాను మొదటి దశలో ఉన్నానని వివరించింది. 13 ఏళ్లుగా స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నానని కూడా తెలిపింది. ఒక సారి సమంతతో కలసి ఈ విషయం గురించి మాట్లాడుతానని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంది. కాగా కల్పిక ఇటీవల విడుదలైన ‘యశోద’ మూవీలో నటించింది. అంతకుముందు ‘పడి పడి లేచే మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించింది.

    ‘నువ్వు లేకపోతే నేనేం చేసేవాడినో?’

    నువ్వు లేకపోతే నేనేం చేసేవాడినో అంటూ తన భార్య మనసుకు హత్తుకునేలా టీమిండియా విధ్వంసక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బర్త్ డే విషెష్ తెలిపాడు. నవంబర్ 17న తన భార్య దేవిషా శెట్టి బర్త్‌డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. కివీస్ టూర్‌లో ఉన్న స్కై.. ఇన్‌స్టా ద్వారా తన భార్యకు మెసేజ్ పంపాడు. తన మోటివేటర్, తన ప్రతి సమస్యను పరిష్కరించే వ్యక్తి అంటూ భార్యను పొగిడాడు. కాగా సూర్యకుమార్, దేవిషాలకు 2017లో వివాహమైంది.

    బ్లాక్ జాకెట్‌లో.. బ్యూటిఫుల్ నిధి

    టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఏ పోస్టు పెట్టినా లక్షల్లో లైక్స్, వ్యూస్ వస్తూ ఉంటాయి. తాజాగా బ్లాక్ జాకెట్‌లో బ్లాక్ షార్ట్‌తో ఉన్న ఓ ఫోటోను నిధి తన ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కిల్లింగ్స్ లుక్స్‌తో ఫోటోకు ఫోజులిచ్చిన నిధిని చూసి ఆమె అభిమానులు, నెటిజన్లు ఆ ఫోటోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.