రష్యా సైనికుల వద్ద ‘వయాగ్రా’
ఉక్రెయిన్లో అత్యాచారాలు, లైంగిక వేధింపులు రష్యన్ సైనిక వ్యూహంలో భాగమేనని యూఎన్ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్ ఆరోపించారు. బాధితులతో అమానవీయ ప్రవర్తన కూడా ఉద్దేశపూర్వకమేనని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో రష్యా సైనికులు మహిళలను నిర్బంధించి, అత్యాచారాలకు పాల్పడుతున్నారని తెలిపింది. రష్యా సైనికులు వారి వెంట వయాగ్రా తెచ్చుకుంటున్నట్లు తెలిసిందని చెప్పారు. ఇవన్నీచూస్తుంటే సైనిక వ్యూహంలో భాగమేనని స్పష్టమవుతోందన్నారు.