ఏజెంట్ అవతార్‌లో వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల F3 మూవీతో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత మూవీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ ఏజెంట్‌గా కనిపించనున్నాడట. షూటింగ్ మొత్తం లండన్‌లో జరుగుతుందని తెలుస్తుంది. వరుణ్ స్టైలిష్ ఏజెంట్‌గా కనిపించేందకు తన లుక్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఇప్పటికే సిద్ధంగా ఉంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.