ఆర్థిక రాజధానిలో నిషేధాజ్ణలు
వచ్చే నెల 1 నుంచి 15 వరకు ఆర్థిక రాజధాని ముంబైలో నిషేధాజ్ణలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబైలో లాఅండ్ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని, అందుకే ఆ రోజుల్లో నిషేధాజ్ణలు విధించారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమిగూడటం, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, లౌడ్స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, సంగీతంపై కూడా నిషేధం విధించారు. ఎవరైనా నిషేధాజ్ణలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష విధించనున్నారు.