ర్యాంగింగ్ నిందింతులను పరీక్ష రాయనివ్వండి: హైకోర్టు
తెలంగాణ: తోటి విద్యార్థిపై ర్యాంగింగ్కు పాల్పడిన శంకర్‌పల్లిలోని ఇక్ఫాయ్ లా యూనివర్సిటీ విద్యార్ధులను పరీక్షలకు అనుమతివ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను సింగిల్ జడ్జి కొట్టేయడంతో వారు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఈసారికి పరీక్షలకు అనుమతించాలని యూనివర్సిటీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.