• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన

    భాగ్యనగరాన్ని వరుణుడు వీడటం లేదు. ఉదయం కాస్త ఎండతో కాస్త తెరపిచ్చినట్లు అనిపించినా మళ్లీ మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపెడుతోంది. భారీ వానలతో రహదార్లు జలమయమవుతున్నాయి. వాహనదార్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

    HYD: అకాల వర్షంతో విమానాల దారులు మళ్లింపు

    హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. నగరంలోని అన్ని ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. దీంతో నగరంలో ల్యాండ్ అవ్వాల్సిన విమానాలను అధికారులు దారులు మళ్లించారు. అత్యవసరంగా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

    హైదరాబాద్ నగరంలో వర్షం

    హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం ఈదురు గాలులతో కూడి తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. జూబిలీ హిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, కుత్బుల్లాపూర్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు మలక్‌పేట్‌లో బైక్‌పై చెట్టు కూలింది. ఉదయం నుంచి ఎండ వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. చల్లగా వర్షం చినుకులు పడడంతో కొంత సేదదీరారు.