ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.