FLASH: తెలంగాణ రైతులకు శుభవార్త
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. యాసంగిలో పండిన వరి ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో వరి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.