రోడ్డు ప్రమాదాల్ని తగ్గిస్తున్నాం
రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 18నుంచి 34 ఏళ్ల వయసున్న వారే బాధితులుగా ఉంటున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. అయినా ఏదో అసంతృప్తి కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘5లక్షల ప్రమాదాలు జరగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మేమెంతో ప్రయత్నిస్తున్నాం. రోడ్డుపై ఇంజినీరింగ్, అత్యవసర సేవల్ని విస్తరిస్తున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. కొంతమంది చట్టాన్ని గౌరవించకపోవడం కలచివేస్తోంది’ అని చెప్పారు.