• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బతుకమ్మ ఆడలేదని జీతాలు కట్‌!

    బతుకమ్మ ఆడలేదని జీతాలు కట్‌ చేసిన సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని కొందరు అంగన్‌వాడీ ఆయాల వేతనాలు నిలిపివేశారు. మరికొందరికి కోతలు విధించారు. కొన్ని వర్గాల మహిళలు తమ మతాలకు బతుకమ్మ వ్యతిరేకమని కారణంతో వారు బతుమ్మలో పాల్గొనలేదు. వారి వేతనాల్లో రూ.300 చొప్పున మినహాయించినట్లు తెలుస్తోంది. నెలకు వచ్చే జీతం రూ.7800 నుంచి రూ.300 కోత పెడితే తాము ఎవరికి చెప్పుకోవాలని మహిళలు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

    భారత రాష్ట్రపతి పదవికి ఎందుకంత విలువ?

    ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా భారత రాష్ట్రపతి గురించిన చర్చే నడుస్తోంది. అసలు రాష్ట్రపతి పదవికి ఎవరు అర్హులు? ఆ పోస్టు వస్తే శాలరీ ఎంతుంటుంది? రాష్ట్రపతి పదవితో కలిగే రాజభోగాలేంటో ఓ సారి లుక్కేస్తే.. **అర్హతలు:** – భారతీయ పౌరుడై ఉండాలి – 35 సంవత్సరాలు దాటి ఉండాలి – లోక్‌సభకు ఎన్నికయ్యే సభ్యులకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉండాలి **శాలరీ:** – రాష్ట్రపతికి నెలకు రూ. 5,00,000 వేతనం ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అత్యధిక వేతనం పొందేది రాష్ట్రపతి ఒక్కడే. … Read more

    ఆ కంపెనీ ఉద్యోగులకు జీతానికి బదులుగా బంగారం..

    లండన్ కు చెందిన టాలీమనీ అనే ఓ సంస్థ తమ సంస్థ ఉద్యోగులకు జీతానికి బదులుగా బంగారాన్ని ఇస్తోంది. ఆ సంస్థ సీఈవో కెమెరాన్ పెర్రీ ఇందుకు గల కారణాలను వెల్లడించాడు. నగదు ఇస్తే అది వారు ఖర్చు చేసే సమయానికి విలువ తగ్గిపోవచ్చునని కానీ బంగారం విలువ పెరుగుతూ పోతుందే తప్పా తగ్గడం లేదని తెలిపాడు. అందుకోసమే తమ కంపెనీ ఉద్యోగులకు నగదుకు బదులు బంగారం ఇస్తున్నట్లు తెలిపాడు.

    TS: వీఆర్‌ఏల వేతనంపై త్వరలో క్లారిటీ

    VRA(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్)ల పే స్కేల్ అంశంపై త్వరలోనే క్లారిటీ రానుంది. విద్యార్హతలు పరిగణనలోకి తీసుకోని ఈ చెల్లింపులు ఉంటాయని రెవెన్యూ అధికారుల సమాచారం. పదో తరగతి పాసైన వారికి పే స్కేల్ వర్తింపజేసి, అంతకంటే తక్కువ విద్యార్హత ఉన్న వారికి గౌరవ వేతనం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. పదో తరగతి కంటే ఎక్కువ చదివిన వీఆర్‌ఏలు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది ఉన్నట్లు అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ని రెవెన్యూ శాఖ సిద్ధం చేసిందని, సీఎం కేసీఆర్ సంతకం పెట్టడమే ఆలస్యమని … Read more