నేనుంటే ఇండియానే అన్ని వరల్డ్ కప్పులూ గెలిచేది: శ్రీశాంత్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ కు దూరమైన శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైమ్స్ నౌ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కోహ్లీ కెప్టెన్సీలో అడి ఉంటే…2015, 2019, 2021 ప్రపంచ కప్ లు టీమిండియానే గెలిచేదని చెప్పాడు. అంతకు ముందు శ్రీశాంత్ 2007 టీ20 వరల్డ్ కప్ మరియు 2011 వన్డే ప్రపంచ కప్ టీముల్లో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్ ను అప్పట్లో లక్కీ లెగ్ అనేవారు.