• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 11 నుంచి శ్రీశైల మల్లన్న ఉత్సవాలు

  ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 7 నుంచి 21 వరకు స్వామి వారి ఆలయంలో స్పర్శ దర్శనం రద్దు చేశారు. అలాగే ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. స్వామివారి అలంకార దర్శనానికి భక్తులందరినీ అనుమతించను న్నారు. ఫిబ్రవరి 14న టీటీడీ తరఫున, 15న రాష్ట్రప్రభుత్వం తరఫున భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాలకు దాదాపు 8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.

  హైదరాబాద్-శ్రీశైలం హైవేపై పులి

  హైదరాబాద్-శ్రీశైలం హైవేపై పెద్ద పులి కనిపించడంతో వాహనదారులు బెదిరిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ సమీపంలో పెద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి, సెల్‌ఫోన్లలో పులిని ఫొటోలు తీశారు. దీనిపై డీఎఫ్ఓ రోహిత్ స్పందించారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. అందుకే మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు పులులు రోడ్డు దాటుతూ కనిపిస్తున్నాయని చెప్పారు.

  శ్రీశైలం ప్రాజెక్టుకు వరద

  AP: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం 5 గేట్లను అధికారులు ఎత్తివేశారు. జలాశయానికి భారీగా ప్రవాహం వస్తుండటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1,16,516 క్యూసెక్కులు వస్తుండగా.. 2,06,069 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది.

  శ్రీశైలం 7 గేట్లు ఎత్తి నీటి విడుదల

  శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2 లక్షల 43 వేల 789 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 2 లక్షల 59 వేల 271 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. వరద మరింత పెరగుతోందని అధికారులు చెబుతున్నారు.

  31-03-2022 నేటి ప్రధాన అంశాలు @8.40AM

  – ఏప్రిల్ 2 నుంచి మోహదీపట్నం రైతు బజార్ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు ఏసీ బస్సులు నడపనున్న ఆర్టీసీ – నేటితో తెలంగాణలో స్కాలర్‌షిప్, బోధనా ఫీజులకు దరఖాస్తుల గడువు పూర్తి – తెలంగాణలో నేటితో ముగియనున్న ఇళ్ల క్రమబద్దీకరణ గడువు – నేడు మరోసారి పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు – పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేఖంగా నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేయనున్న వామపక్షాలు – తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పెంచిన … Read more